వెలగపూడి .. ప్రముఖ సీనియర్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు (kota srinivasarao) మరణ వార్త (death news) తీవ్ర బాధాకరమని అన్నారు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ (ap deputy cm pawan kalyan) . . దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా ఇకలేరు అనే వార్త సినీరంగానికి తీరని లోటు అని సంతాపం సందేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి రితో కలిసి ప్రాణం ఖరీదు సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి అర డజనుకు పైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పవన్ కల్యాణ్
