హైదరాబాద్ – చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన ప్రకృతి యోధుడు పద్మశ్రీ వనజీవి రామయ్య ని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపి, బిఆర్ ఎన్ నేత సంతోష్ కుమార్. ఆయన స్ఫూర్తిదాయకమైన వారసత్వం తరతరాలుగా నిలిచి ఉంటుందన్నారు. ఆయనతో కలసి పని చేసే అవకావం తన అదృష్టమని అన్నారు.. తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలకు ఆయన ఎంతగానో ప్రొత్సాహం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.. వనజీవి రామయ్య మృతి పట్ల ఆయన కుటుంబానికి తన హృదయపూర్వక సానుభూతిని తెలీయజేస్తున్నానంటూ తన ఎక్స్ ఖాతా ద్వారా సంతాపాన్ని ప్రకటించారు సంతోష్ ..
RIP | పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి రామయ్య – మాజీ ఎంపి సంతోష్ కుమార్
