RIP | మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కన్నుమూత – సంతాపం తెలిపిన రేవంత్

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటు తో మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సన్నిహితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు. ఇక రంగారెడ్డి మృతి నేపథ్యంలో రాజకీయ నాయకులు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గారి మరణం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు…నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు.

.

Leave a Reply