పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో అలజడి..

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో అలజడి..

  • నలుగురు హమాలీల‌కు తీవ్రగాయాలు
  • మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

విజయనగరం, ఆంధ్రప్రభ బ్యూరో : పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్శిల్ కౌంటర్ వద్ద బస్సులో పేలుడు కలకలం రేపింది. అకస్మాత్తుగా పేలుడు సంభవించటంతో ఆరుగురు హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి వచ్చిన బస్సు.. జనం దిగిపోయిన తరువాత పార్శిల్స్ దించటానికి కౌంటర్ కు వెళ్లింది.

ఆర్టీసీ బస్సుపై నుండి పార్శిల్ బాక్స్ లను అన్ లోడ్ చేస్తుండగా ఒక్క సారిగా పేలుడు సంభవించింది. దీపావళికి మందుగుండు పార్శిల్ ను ఒక్క సారిగా కిందకు పడేయడంతో సామాగ్రి పేలింది.

ఈ ఘ‌ట‌న‌లో నలుగురు హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బైకుకు మంటలు అంటుకున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. విజయనగరం నుంచి పార్వతీపురానికి 25 కిలోల పార్శిల్ బాక్సు చేరింది. ఈ పార్శిల్ ఎవరు బుక్ చేశారనే అంశంపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply