ఆంధ్రప్రదేశ్‌లో రోయింగ్‌కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రోయింగ్‌కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు

సూర్యలంక, విజయవాడ, విశాఖలో ప్రధాన సెంటర్లు
ఆర్ ఎఫ్ ఐ పూర్తి సహకారానికి హామీ

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్క్యూలింగ్ అండ్ రౌయింగ్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు డా. తరుణ్ కాకాని, రౌయింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడు బాలాజీ మారడపాతో కలిసి స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్. భారణి ను కలిశారు.


ఈ సమావేశంలో రాష్ట్రంలో రోయింగ్ క్రీడ అభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి. సూర్యలంక, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో మూడు ప్రధాన రోయింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, జంగారెడ్డిగూడెంలో అదనపు కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున పడవలు, కోచ్‌లు సాంకేతిక సహాయం అందిస్తామని శ్రీ బాలాజీ మారడపా హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఎస్. భారణి ని సన్మానించారు.


డా. తరుణ్ కాకాని మాట్లాడుతూ, ఏప్రిల్ 3వ తేదీ నుండి జిల్లా స్థాయి ఎంపికలు ప్రారంభమవుతాయని, తరువాత ఏప్రిల్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను రోయింగ్‌లో జాతీయ స్థాయిలో ముందంజలో నిలపడానికి ఈ సమావేశం కీలక ముందడుగుగా నిలుస్తోంది.

Leave a Reply