తెలంగాణ బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం

తెలంగాణ బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం
బీఆర్ఎస్ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అన్యాయం చేశారని చౌటుప్పల్ మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు, దండు మల్కాపురం గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ ఆరోపించారు. చౌటుప్పల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో టాప్ గేర్లో ప్రభుత్వ నడిస్తే కాంగ్రెస్ హయాంలో రివర్స్ గేర్ లో ప్రభుత్వం నడుస్తుందన్నారు.
ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మూడు సంవత్సరాల పేరు మీద సగం కూడా కేటాయించలేదని, మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టింది, రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 2.80 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ రెండున్నర సంవత్సరాల పాలనలో 3.75 లక్షల కోట్లు అప్పు చేసిందని, ప్రాజెక్టుల ప్రస్థానం లేదు, నిరుద్యోగుల ప్రస్తావన లేదు, జర్నలిస్టుల ప్రస్తావన లేదన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే ప్రజలే కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్తారని నిరంజన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, రైతుబంధు జిల్లా మాజీ డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, నాయకులు బాతరాజు యాదగిరి, చిన్నగోని వెంకటేశం, బాతరాజు లింగస్వామి, సోమ శ్రీధర్ రెడ్డి, ఉదిరి రాకేష్, గంగాదేవి శివ తదితరులు పాల్గొన్నారు.
