Revenue Clinics | రెవెన్యూ క్లినిక్స్ ద్వారా తక్షణ పరిష్కారం
- జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Revenue Clinics | విజయనగరం, ఆంధ్రప్రభ : పీజీఆర్‌ఎస్ లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్(Revenue Clinics) ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఇవాళ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పిజఆర్ఎస్ లో కలెక్టర్ మాట్లాడుతూ… రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సాధ్యమైనంత వరకు రికార్డుల ఆధారంగా ఆన్ ది స్పాట్(On the Spot)లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందిస్తామని చెప్పారు.
తహసీల్దార్లు, ఆర్‌డీవోలు సమక్షంలో పిటిషనర్లకు పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్చువల్ సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అన్ని పిటిషన్లను డేటాబేస్(Database)లో నమోదు చేసి వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత 3–4 నెలల్లో జిల్లాలో పీజీఆర్‌ఎస్ సంతృప్తి ర్యాంకింగ్‌లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు.

పిటిషన్ల పరిష్కారానికి సాధారణంగా ఒక వారం టైమ్‌లైన్ నిర్ణయించినట్లు, కొన్ని ROR కేసులు మినహా మిగతావన్నీ వేగంగా పరిష్కరిస్తూ ప్రజల సంతృప్తిని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, అర్హత ఆధారంగా వెరిఫికేషన్(Verification) చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్‌డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

