Revenue | భూభారతి ఫైళ్ల పరిశీలన…

Revenue | భూభారతి ఫైళ్ల పరిశీలన…
Revenue | జక్రాన్ పల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాలో భూభారతి పథకం కింద ఆన్ లైన్ లో అత్యధికంగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు, కేశ్ పల్లి గ్రామంలో ఉండడంతో జిల్లాలో కేశ్ పల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు(pilot project)గా ప్రభుత్వ అధికారులు ఎంపిక చేశారు.
గత మూడు నాలుగు రోజుల నుండి మండల రెవెన్యూ అధికారులు(revenue officials), గ్రామంలోనే ఉండి, భూమి రెవెన్యూ వివాదాలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నారు. అధికారులు ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు.. వంటి విషయాలను ఈరోజు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞ మాలవ్య ఆకస్మికం(contingency)గా పర్యటించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞ మాలవ్య, చక్రన్ పల్లి ఎమ్మార్వో, కిరణ్ మై, ఆర్ఐ ప్రవీణ్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
