OTT రిలీజ్‌కు రెడీ అయిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ !

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 21న తమిళం, తెలుగులో ఒకేసారి థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా… తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ చిత్రం మార్చి 21 నుండి ఓటీటీలో అందుబాటులో రానుంద‌ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఏకకాలంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *