కారుమంచి రెవెన్యూ పరిధిలో..
శావల్యాపురం, అక్టోబరు 7(ఆంధ్రప్రభ) : కారుమంచి (Karumanchi) రెవెన్యూ పరిధిలోని వయ్యకల్లు గ్రామంలో రీసర్వేపనులను రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి గ్రౌండ్ ట్రూటింగ్ పనులు ప్రారంభించారు. టీడీపీ మండల నాయకుడు గోనుగుంట్ల వెంకట్రావు, గ్రామ సర్పంచ్లు గోనుగుంట్ల వెంకటేశ్వర్లు, మద్దినేని ఆంజనేయులు పాల్గొన్నారు.
మండల సర్వేయర్ (Mandal Surveyor) రవికుమార్ మాట్లాడుతూ…. కారుమంచి రెవెన్యూ పరిధిలో మొత్తం 7,226 ఎకరాల భూవిస్తీర్ణం ఉందని, ప్రతిరోజూ 6 సర్వేబృందాలతో రీసర్వేని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామ సరిహద్దులు ఖరారు చేయడం పూర్తయిందని, రైతుల పట్టా భూములు సర్వేని నేడు ప్రారంభించామన్నారు. రీసర్వే (Resurvey) కి రైతులంతా సహకరించాలని, రైతులు పొలాల సరిహద్దులు దగ్గరుండి చూపిస్తే వ్యత్యాసాలకు తావులేకుండా ఉంటుందన్నారు. వీఆర్వోలు దేవమ్మ, రాధ తదితరులు ఉన్నారు.