Results | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Results | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Results | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : క్షేత్రస్థాయిలో అకౌంటబిలిటీ ఫిక్స్ అవ్వాలని, అసెంబ్లీతో తమకైనా, అధికారులకైనా అకౌంట‌బిలిటీ ఉందాల్సిందేనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘క్షేత్రస్థాయిలో ఉదాసీనంగా ఉంది. ఫలితాలు కనిపించడం లేదన్నారు.

పథకాలు అమలు చేయడంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు. అద్భుతంగా చేశామంటున్నా.. కొన్ని చోట్ల గ్యాప్ ఉంది. ప్రాజెక్టులు పారదర్శంగా చేపట్టాలి. ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో కనిపించాలి. జలజీవన్ మిషన్ కింద పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభించాం. సీఎం, నేను అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకుంటున్నాం. అందుకే క్షేత్రస్థాయిలో ఫలితాలు రావాలని కోరుతున్నాం’ అని పవన్ అన్నారు.

Leave a Reply