China | రెస్టారెంట్ లో మంట‌లు… 22మంది మృతి

బీజింగ్: చైనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్ లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఓ రెస్టారెంట్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22మంది మృతిచెందారు. మధ్యాహ్నం రెస్టారంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 22మంది మృత్యువాత పడగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పందించారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నెలలోనే చైనాలో ఇది రెండో అతిపెద్ద అగ్నిప్రమాదం కావడం గమనార్హం. ఏప్రిల్ 9న నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్స్ లోని ఓ నర్సింగ్ హోమ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 20మంది వృద్ధులు మృతిచెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలోని నర్సింగ్ హోమ్ లో మంటలు చెలరేగిన సమయంలో 39మంది వృద్ధులు భవనంలో ఉండగా.. 20మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *