Response |కృష్ణపట్నంలో వెలుగులు

Response | కృష్ణపట్నంలో వెలుగులు
- ఆంధ్రప్రభ వార్తకు కొన్ని గంటల్లోనే అధికారుల స్సందన
Response | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో విద్యుత్తు శాఖ సైనికులు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు (Restored). బుధవారం మధ్యాహ్నం ఇళ్లల్లో కరెంటు వెలుగులు(Electric lights) రావటంతో.. ఫ్యాన్లు గిరగిర తిరగటంతో.. కృష్ణపట్నం జనం ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్తు శాఖ సిబ్బందిని ప్రశంసించారు.
ద్విత్వా తుఫాను ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం(Sarvepalli Constituency) ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా(Electricity supply) నిలిచిపోయింది. గ్రామానికి సమీపంలో విద్యుత్ స్థంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇక గ్రామంలో ప్రజలు అల్లాడిపోయారు. ఈ స్థితిలో బ్రహ్మదేవి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్(Brahmadevi Electricity Department Substation) ఏఈ అక్బర్ ను ఆంధ్రప్రభ వివరణ కోరగా.. మధ్యాహ్నం రెండు గంటల లోపు మరొక లైనుకు అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే.. కృష్ణపట్నంలో విద్యుత్తును పునరుద్ధరించారు.
