రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి

రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి
- సీపీఐ డిమాండ్
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి చర్లగూడెం ప్రాజెక్ట్ నుంచి సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జీపు కళాజాత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేయడం ద్వారా మండలంలోని రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రిజర్వాయర్ ఏర్పాటు చేసేంతవరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగొని గాలయ్య, కురుమిద్ద శ్రీనివాస్, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ్, మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
