రెస్క్యూ టీమ్ చాకచక్యం
- ఎస్పీ అభినందనలు
సోంపేట (శ్రీకాకుళం జిల్లా), ఆంధ్రప్రభ : శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో భారీ వర్షాలతో సోంపేట మండలంలో గురువారం రాత్రి మహేంద్ర తనయ నది నీటి ఉధృతి పెరిగింది. ఈ వరద ప్రవాహంలో కొట్టుకు పోతున్న ఓ వంతెన నిర్మాణ కార్మికుడిని రెస్క్యూ టీమ్(Rescue Team) కాపాడింది. ఈ బృందాన్ని జిల్లా ఎస్పీ(District SP) అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బారువా, మూలపాలెం(Moolapalem) గ్రామాల మధ్య కొత్త వంతెన నిర్మాణంలో ఒడిశా(Odisha), బాంజీ బాల్ చిలపడ గ్రామానికి చెందిన నవీన్ మాజీ అనే కార్మికుడు పని చేస్తున్నాడు.
గురువారం సాయంత్రం పనిముట్లు తీసుకు రావడానికి వంతెన వద్దకు వెళ్లాడు. అదే సమయంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు, ప్రాణాపాయ స్థితిలో నదిలోని ఒక స్తంభానికి పట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల(police)కు సమాచారం అందించారు. వెంటనే బారువా సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు నాయుడు, సిబ్బంది జయరాం, బాలకృష్ణ , మెరైన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, బారువా, కొత్తూరు గ్రామస్థుల సహకారంతో పడవను ఉపయోగించి, బాధితుడిని కాపాడాడరు.
పెట్టి ధైర్యసాహసాలతో నదిలో చిక్కుకున్నకార్మికుడి(labour)ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు.అనంతరం ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణలో పోలీసులు చూపిన చాకచక్యం, ధైర్యసాహసం అభినందనీయమైనదని. వరద ముప్పు సమయంలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112,100 నంబర్‌కు(dial 112,100 number),జిల్లా కంట్రోల్ రూమ్ నకు కాల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చునని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.