Rescue Operation | సన్నగిల్లుతున్న ఆశలు : సజీవంగా రావాలని ప్రార్థనలు

శైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయి. 48 గంటలుగా ఆపరేషన్ కొనసాగుతున్నా.. చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ తెలియటం లేదు.అన్ని రకాలుగా రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురదతో సహాయక చర్యల కు అడ్డుగా మారుతోంది.

లోపల ఉన్న వారిని రక్షించేందుకు నేటి ఉదయం మరికొన్ని టీమ్ లో లోనికి ప్రవేశించాయి. సింగరేణి, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎ్‌ఫకు చెందిన దాదాపు 23 మంది టీమ్‌ టన్నెల్‌ సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

కాగా, ఎనిమిది మంది చిక్కుకున్న ప్రాంతానికి గాలి సరఫరా లేకపోవటం.. కాలం గడుస్తుండటంతో వారి విషయంలో ఆందోళన పెరిగిపోతోంది. మంత్రులు అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించటం లేదు.

కొనసాగుతున్న ఆపరేషన్

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారి గురించి ఆందోళన పెరిగిపోతోంది. పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లో చిక్కు కున్న వారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సింగరేణి రెస్క్యూ బృందాలు, హైడ్రా, ఇండియన్‌ ఆర్మీ, స్పెషల్‌ బెటాలియన్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సొరంగంలో దాదాపు 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తున బురద పేరుకుపోయింది. నిమిషానికి 3500 లీటర్ల వరకు ఊటనీరు వస్తుంది

మంత్రుల మకాం

టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం) నుంచి దాదాపు 400 మీటర్ల వరకు మట్టి కూరుకుపోయినట్లు గుర్తించారు. లోపల చిక్కుకున్నవారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని భావిస్తున్నారు. లోపలి కి వెళ్లివచ్చిన వారు కూడా.. సహాయక చర్యలు పూర్తయి, టన్నెల్‌లో చిక్కుకున్నవారి వద్దకు వెళ్లా లంటే కనీసం మూడు రోజుల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం మూడో బృందంలో టన్నెల్‌ లోపలికి వెళ్లి వచ్చారు.

అయితే, అసలు సొరంగంలో ఘటన ప్రాంతానికి వెళ్లడం పెద్ద సవాల్‌గా మారింది. మట్టి, బురదను తొలగించడం రెస్య్కూ బృందాలకు క్లిష్టమైన పనిగా భావిస్తున్నారు.పెరుగుతున్న టెన్షన్ప్రమాద దాటికి సొరంగంలో ఉన్న వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సంబంధిత విభాగాలతో ఆరా తీశారు. కాగా, సహాయక బృందాలకు సహకారం అందించేందుకు సికింద్రాబాద్‌ బైసన్‌ డివిజన్‌ ఇంజనీర్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఈటీఎఫ్‌) బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో భాగంగా భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయడంతోపాటు రెండు ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *