చౌటుప్పల్ లో ఓపెన్ ప్లై ఓవర్ ని నిర్మించాలని ఆర్డీవోకు వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హైవే విస్తరణలో భాగంగా చౌటుప్పల్ బస్టాండు ఎదురుగా ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని, చౌటుప్పల్ చెరువు అలుగునీరు సాఫీగా వెళ్లే విధంగా హైవేకి రెండవ వైపు ఉన్న అండర్ డ్రైనేజీలోకి పైప్ లైన్ కలపాలని చౌటుప్పల్ పట్టణంలో సిపిఎం నాయకులు శుక్రవారం ప్రదర్శన చేసి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. చెరువు నిండినప్పుడు, చెరువు కట్టకు, కాలనీ వాసులకు, హైవే రోడ్డు పైకి, షాపుల్లోకి, నీరు రావడం జరుగుతుందని, రెండవ వైపు ఉన్న డ్రైనేజీకి పైపులైన్ కలపాలని కోరారు.
హైవే రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేసి, రోడ్డుకు ప్రజలు అటువైపుకు వెళ్లే విధంగా తాత్కాలికంగా వెసులుబాటు కలిగించాలని కోరారు. రోడ్డుకు రెండవ వైపు ప్రభుత్వం ఆసుపత్రి, కూరగాయల మార్కెట్, స్కూల్స్, ఉండడంవల్ల ప్రయాణికులు, ప్రజలు, అటువైపు వెళ్లాలంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, రోడ్డు త్వరగా పూర్తిచేసి తాత్కాలికంగా రోడ్డు దాటే ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆదిమూలం నందీశ్వర్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, కొండే శ్రీశైలం, తొర్పునూరు మల్లేశం, బోయ యాదయ్య, జంగయ్య, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు ఆధ్వర్యంలో మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు.
