Renjal | జాతీయ స్థాయిలో రాణించిన మా ఆణిముత్యం

Renjal | జాతీయ స్థాయిలో రాణించిన మా ఆణిముత్యం
- తాడ్ బిలోలి విద్యార్థినిని సర్పంచ్ అభినందన
Renjal | రెంజల్, ఆంధ్రప్రభ : మండలంలోని తాడ్ బిలోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.అక్షయ జాతీయ స్థాయి క్రీడా పోటీలో పాల్గొనడంతో స్థానిక సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుమూల ప్రాంతం నుండి జాతీయ స్థాయికి ఎదగడం గ్రామానికి గర్వకారణమన్నారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నెట్ బాల్ అండర్-19 పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రాణించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు మరింత మంది క్రీడల్లో రాణించాలని, అందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇంకా పిఈటి కుమార్, ప్రధానోపాధ్యాయులు రేఖ, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
