Renigunta | స్నానానికి వెళితే..

Renigunta | స్నానానికి వెళితే..

Renigunta, ఆంధ్రప్రభ : రేణిగుంట (Renigunta) మండలంలోని కరకంబాడి సమీపంలో గల మల్లిమడుగు డ్యామ్ లో పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు తిరుపతికి (Tirupati) చెందిన శివ (35), నరేష్ (36) టాక్సీ డ్రైవర్లగా పని చేస్తున్నారు. ఇటీవల అయ్యప్ప మాల ధరించి మాల ముగించుకోవడంతో ఆదివారం సరదాగా మల్లిమడుగు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. డ్యాం నీళ్లలో స్నానం చేద్దామని దిగడంతో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు.

ఘటన స్థలానికి చేరుకున్న రేణిగుంట పోలీసులు (Police) స్థానికల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు సమాచారాన్ని మృతుల కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో డ్యాం దగ్గరకు చేరుకుని బోరుమని విలపించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తిరుపతికి తరలించారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply