PARK | కర్నూలులో రిలయన్స్ గ్రీన్ ఫీల్డ్  ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ 

PARK | తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) .. విశాఖపట్నం లో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు సందర్భంగా పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఈడీ ఎంఎస్ ప్రసాద్, సౌత్ ఇండియా మెంటార్ మాధవరావు సమావేశమయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో 1 జిగా బైట్  ఏఐ డేటా సెంటర్, 6 జి డబ్ల్యుఎఫ్‌ సౌర విద్యుత్ ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఫుడ్ పార్క్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆ  సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఫుడ్ పార్క్‌ను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సానుకూలత వ్యక్తం అయినట్టు తెలుస్తోంది.

కర్నూలులో 170 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అయ్యే  గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను నిర్మితం అవుతుంది ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌ కర్యాలతో ఏర్పాటు అయ్యే ఆ ఫుడ్ పార్క్  వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అవకాశాలు ఎక్కువగా కలగనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగావకాశాలు,  టెక్నాలజీ, పవర్, అగ్రికల్చర్… అన్ని రంగాలలోనూ యువతకు ఉపాధి మార్గాలు లభించనున్నాయి.

Leave a Reply