release | ముసాయిదా ఓటర్ జాబితా విడుదల

release | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని 12వార్డుల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ఇవాళ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ… కార్యాలయ పని వేళల్లో జాబితాను పరిశీలన చేసుకుని అభ్యంతరాలు ఉన్నయెడల కార్యాలయంలో తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
