పాడి రైతులకు నిత్యం ఆదాయం..

వేంసూరు, ఆంధ్రప్రభ ; పశువుల పెంపకం రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం అందిస్తుందని సర్పంచ్ పొట్లపల్లి శ్రీదేవి భాను ప్రకాష్ అన్నారు. పల్లెవాడ గ్రామంలో శుక్రవారం పశు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటల ద్వారా ఏడాదికి ఒకటి, రెండు సార్లు ఆదాయం వస్తే, పశు పెంపకం ద్వారా నిత్యం ఆదాయం ఉంటుందన్నారు. పశువులకు కావలసిన పశుగ్రాసం, దాణ, సకాలంలో వైద్యం, సంరక్షణా చర్యలతో పశు పోషణ లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, పంచాయితీ కార్యదర్శి అఖిల్ రెడ్డి, ఉప సర్పంచ్ కుటుంబరావు, చాట్ల వెంకటేశ్వరరావు, బొంతు రామారావు, పత్తిపాటి రాములు, వైద్య సిబ్బంది, గోపాలమిత్ర సిబ్బంది, పశు పెంపకం దారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply