MLA | ప్రజల్లో సేవ చేస్తేనే గుర్తింపు..

MLA | ప్రజల్లో సేవ చేస్తేనే గుర్తింపు..
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
MLA | జన్నారం, ఆంధ్రప్రభ : ప్రజల్లో ఉద్యోగరీత్యా సేవ చేసిన అధికారులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం తాహసిల్దార్ చిట్ల రాజామనోహర్ రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న దృశ్య స్థానిక ఫంక్షన్ హాల్ లో ఆదివారం సాయంత్రం కార్యాలయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమనోహర్ రెడ్డి తాహసిల్దారుగా అధికారుల ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవలు అందించాలన్నారు.
ఉద్యోగరీత్యా 33 ఏళ్లుగా మచ్చలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని.. మంచి మనసున్న మనిషికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, స్థానిక డిప్యూటీ తాహసిల్దార్ రామ్మోహన్, ఎంఈఓ విజయకుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసిహుల్ల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్,మాణిక్యం, కలమడుగు హెచ్ఎం రాజమౌళి,ఎమ్మారైలు భానుచందర్,గంగరాజు, కార్యాలయ ఉద్యోగులు, జీపీఓలు,పంచాయతీ కార్యదర్శులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
