సొంత మైదానంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కాగా, హోం గ్రౌండ్ లో తడబడుతున్న బెంగళూరు జట్టుకు ఈ సారి ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (21 బంతుల్లో 26), విరాట్ కోహ్లీ (16 బంతుల్లో 27) మంచి ఆరంభం ఇచ్చారు. వరుసగా.. బౌండరీలు బాదేస్తూ పవర్ ప్లేలో దాదాపు ఓవర్ కు 10 రన్ రేట్ తో దంచేశారు. దాంతో 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 59/0 గా ఉంది.
అయితే, పవర్ ప్లే అనంతరం హసరంగ బౌలింగ్ లో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (26) క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్ ఉన్నారు.