బెంగళూరు : ఈరోజు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్ల మ్యాచ్ నిర్వహించగా.. పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ.. పంజాబ్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 14 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు సాధించగా.. ఆ టార్గెట్ ను పంజాబ్ 12.1 ఓవ్లలో 5 వికెట్ల నష్టానికి ఛేదించింది.
పంజాబ్ బ్యాటర్లలో నేహల్ వధేరా (33 నాటౌట్) అదరగొట్టాడు. ప్రియాన్ష్ ఆర్య (16) ప్రభసిమ్రాన్ సింగ్ (13), జోష్ ఇంగ్లిస్ (14) పరువాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు.
అంతకముందు ఆర్సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) అర్ధ సెంచరీతో బెంగళూరు స్కోరు 95 పరుగులకు చేరుకుంది. ఇక కెప్టెన్ రజత్ పటీదర్ 23 తో పరువాలేదనిపంచాడు.
ఈ విజయంతో 10 పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్న పంజాబ్ పాయంట్స్ టేబుల్లో 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఆర్సీబీ జట్టు 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయింది.