Loan Pay Easy| ఈఎంఐ కారు చౌక‌…

Loan Pay Easy | ఈఎంఐ కారుచౌక‌…

  • వడ్డీలు తగ్గాయండీ
  • ఈఎంఐలూ ఇక చౌక
  • పండక్కి ఆర్బీఐ వరం

( ఆంధ్రప్రభ,  బిజినెస్​ డెస్క్)​ ​  

Loan Pay Easy

Loan Pay Easy : భారత రుణ గ్రహీతలు ఆర్బీఐ (RBI) శుభవార్త చెప్పింది. రెపో రేటులో మరో 25 పాయింట్లు కోసింది. ఇంకేముందీ.. ఆర్డీఐ ప్రకటన వెలువడిన లోపులోనే ప్రధాన జాతీయ బ్యాంకులన్నీ రెపో లింక్డ్ వడ్డీ రేట్లను తగ్గించినట్టు వెల్లడించాయి.

కెనరా బ్యాంక్ (Canara Bank), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సహా జాతీయ బ్యాంకులన్నీ బెంచ్‌మార్క్‌లకు అనుసంధాన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.

Loan Pay Easy

Loan Pay Easy : ఇక రుణగ్రహీతలకు నక్షత్రకుడి వేదింపులు సడలినట్టే. ఈ నెల (డిసెంబర్ 2025) ప్రారంభంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee – MPC) భేటీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 5.50% నుండి 5.25%కి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణ‌యం తీసుకున్న కొన్ని రోజుల్లోనే ప్ర‌ధాన జాతీయ‌ బ్యాంకుల్లో చలనం వచ్చింది.

Loan Pay Easy

ఆర్డీఐ అడుగుజాడలకు అనుగుణంగా బ్యాంకర్లు తమ రెపో-లింక్డ్ లెండింగ్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రుణగ్రహీతలకు తక్కువ (Loan Pay Easy) చెల్లించే మార్గం సుగమం అయినట్టే.

రెపో రేట్లు తగ్గించిన బ్యాంకులివే..

కెనరా బ్యాంక్ RLLR ను తగ్గించింది. కెనరా బ్యాంక్ తన రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (RLLR) ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది 8.25% నుండి 8% కి తగ్గింది. RLLRతో అనుసంధానంగా లోన్లు తీసుకున్న రుణగ్రహీతలు తమ రుణ ఒప్పందం, నిబంధనల ప్రకారం తగ్గించిన EMI చెల్లించాలి.

Loan Pay Easy

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)లో కోత ప్రకటించింది. ఈ రేటును 8.35% నుండి 8.10%కి తగ్గించారు. ఇందులో 10 బేసిస్ పాయింట్ల బ్యాంక్ స్ప్రెడ్ కూడా ఉంది. సవరించిన రేట్లు డిసెంబర్ 6, 2025 నుండి వర్తిస్తాయి.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన RLLRని 8.10%కి సవరించింది. ఇది డిసెంబర్ 15 నుండి అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఒక ఏడాది MCLR ఇప్పుడు 8.80% వద్ద ఉంది. మూడు సంవత్సరాల MCLR 8.85% వద్ద ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) రెండింటిలోనూ తగ్గింపులను ప్రకటించింది. ఇవి డిసెంబర్ 15 నుండి అమలులోకి వచ్చాయి. SBI EBLR 8.15% ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP), బ్యాంక్ స్ప్రెడ్ (BSP) నుండి 7.90% ప్లస్ CRP, BSPకి తగ్గించింది.

Loan Pay Easy

RBI రెపో రేటుతో నేరుగా ముడిపడిన SBI వసూలు చేసే RLLR, 7.75% ప్లస్ CRP నుండి 7.50% ప్లస్ CRPకి తగ్గించింది. అయితే ఈ తగ్గింపు అర్హత కలిగిన కస్టమర్ల నుంచి తక్కువ EMIలుగా వసూలు చేస్తుంది.

Loan Pay Easy

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా BRLLR ను తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా BRLLR ను 8.15% నుండి 7.90%కి తగ్గించింది. దీంతో రుణగ్రహీతలకు స్వల్ప ఉపశమనం లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అప్ డేట్ చేసిన ఈ రేట్లు డిసెంబర్ 6 నుండి అమల్లోకి వచ్చాయి.

ఇండియన్ బ్యాంక్ RLLRని తగ్గించింది. ఇండియన్ బ్యాంక్ తన రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (RLLR)ని 8.20% నుండి 7.95%కి తగ్గించింది. కొత్త రేట్లు బ్యాంక్ ఆస్తుల పోర్ట్‌ ఫోలియోపై వర్తిస్తాయి. సవరించిన రుణరేట్లు డిసెంబర్ 6 నుండి అమలులోకి వచ్చాయి.

Loan Pay Easy

బ్యాంక్ ఆఫ్ ఇండియా RBLRని తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపో ఆధారిత రుణ రేటు (RBLR)ని 8.35% నుండి 8.10%కి తగ్గించింది. RBI ఈరోజు తన ద్రవ్య విధాన సమావేశంలో ప్రకటించిన రెపో రేటులో తగ్గుదల సవరణ కారణంగా ఈ సవరణ జరిగింది.

RBI రెపో రేటు తగ్గింపు తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన రిటైల్ రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణ రేట్లను 7.35% నుండి 7.10%కి తగ్గించింది. ఇళ్లు కొనుగోలుదారులకు తక్కువ EMIలతో లోన్ అందిస్తోంది.

అదనంగా, కార్ రుణాలపై వడ్డీ రేటును 7.70% నుండి 7.45%కి తగ్గించారు. దీంతో కొత్త రుణగ్రహీతలకు రుణంపై వాహనాలను కొనుగోలు చేయడం సులభం అయింది. ఈ రుణాలపై అన్ని ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంక్ మాఫీ చేసింది, దీనివల్ల కస్టమర్లకు ముందస్తు ఖర్చు తగ్గుతుంది.

ALSO READ : Profit Hunt | గోల్డ్.. గోల్డే

Leave a Reply