Ravindhar l ఆదరించండి అభివృద్ధి చేస్తా..

Ravindhar l ఆదరించండి అభివృద్ధి చేస్తా..
Ravindhar l ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ; ఆదరించండి అభివృద్ధి చేస్తా అని ఆసిఫాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నిలలో 6వ వార్డ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఫుల్లురి రవిందర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ 6 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుల్లూరి రవిందర్ తన ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని ప్రధాన వీధులు, బస్తీలలో ఆయన తన మద్దతుదారులు , పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తూ, చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ప్రచారంలో వార్డు ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్‌కు పంపిస్తే,6వ వార్డును పట్టణంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రవిందర్ భరోసా ఇచ్చారు.
తనను గెలిపిస్తే హిందు స్మశాన వాటిక నిర్మాణ నికి కృషి చేస్తానని వార్డులో నెలకొన్న మురికి కాలువలు సిసి రోడ్లు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వార్డులోని ప్రతి గల్లీలో నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తానని, మురుగునీటి పారుదల సమస్య తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీధి దీపాలు, తాగునీరు తో పాటు పారిశుధ్యం మెరుగుపరచడం ద్వారా వార్డు ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని వాగ్దానం చేశారు. యువతకు అండగా ఉంటూ, వార్డులోని అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని రవిందర్ ఓటర్లకు హామీ ఇచ్చారు.
