మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా రవీందర్..

మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా రవీందర్..

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులుగా మేకల రవీందర్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ చేతుల మీదుగా రవీందర్ అందుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన నిబద్ధతను గుర్తించి, మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా నియమించడం ఆనందంగా ఉందని అన్నారు. దీంతో తన బాధ్యత రెట్టింపు అయ్యిందని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంతో కృషి చేస్తానని అన్నారు.

రాబోయో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి, తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానని హమీ ఇచ్చారు. తన నియమకానికి సహకరించిన చందర్ తో పాటు వర్ధన్నపేట్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply