పెబ్బేరు రూరల్, మార్చి 21 (ఆంధ్రప్రభ) : వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జూరాల కాలువ దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని చెలిమిళ్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ హనుమంతు (డీలర్ బాబు) అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR | ఆర్టీసీ బస్సు ఢీకొని రేషన్ డీలర్ మృతి..
