అమరావతి : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తోంది. రేపటి నుంచి ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల లబ్దిదారుల పరిశీలన కోసం ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించింది. ఇందులో నకిలీ కార్డుల ఏరివేత చేపట్టింది. అలాగే కొత్త కార్డుల కోసం లబ్దిదారులపై అంచనాలు తయారు చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఈకేవైసీ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. దీని గడువును సైతం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది.