Ration | మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్

Ration | మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్
Ration | కూచిపూడి, ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన మొవ్వలో రెండవ నెంబర్ రేషన్ డీలర్ నెరుసు శ్రీ నివాసరావును సస్పెండ్ చేసినట్లు పిడిఎస్ డిటి కె.శ్రీనివాసరావు మంగళవారం రాత్రి తెలిపారు. కార్డుదారులు ఇబ్బందులు పడకుండా ఒకటవ నెంబరు డీలర్ కట్టా సుజాతకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. డీలర్ శ్రీనివాసరావు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు మొవ్వ గ్రామానికి చెందిన మండవ శ్రీకృష్ణ ఈ నెల 2వ తేదీన గ్రీవెన్ సెల్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా అధికారులు దుకాణంపై నిఘా ఏర్పాటు చేశారు. 279 కిలోల బియ్యం తక్కువగా ఉండటంతో అతన్ని నస్సెండ్ చేస్తూ 6ఏ కేసు నమోదు చేసినట్లు డిటి శ్రీనివాసరావు తెలిపారు.
