Ration | ఏఆర్ పల్లి గ్రామస్తులకు స్థానికంగా రేషన్ అందించాలి…

Ration | ఏఆర్ పల్లి గ్రామస్తులకు స్థానికంగా రేషన్ అందించాలి…

  • తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ అశోక్,

Ration | చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఏలేటి రామయ్య పల్లి నూతన గ్రామపంచాయతీ గ్రామ ప్రజలకు స్థానికంగా రేషన్ షాపు ద్వారా బియ్యం అందజేయాలని సోమవారం స్థానిక సర్పంచి కొడారి అశోక్ తహసిల్దార్ ఇమామ్ బాబాకు సోమవారం వినతి పత్రం అందజేశారు. గతంలో చిట్యాల ఉమ్మడి గ్రామపంచాయతీలో రేషన్ బియ్యం డీలర్ అందజేసే వారన్నారు.

దీంతో గ్రామ ప్రజలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామపంచాయతీలో బియ్యం తీసుకునేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.గ్రామంలో 160 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారని స్థానికంగా రేషన్ బియ్యం అందించాలని స్థానికంగా రేషన్ బియ్యం అందించాలని కోరారు . సర్పంచ్ అశోక్ తాసిల్దార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఏలేటి శ్రీనివాస్, మర్రి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply