Rare Honor | బెస్ట్ ఆఫీసర్

Rare Honor | బెస్ట్ ఆఫీసర్
- యాదాద్రి భువనగిరి కలెక్టర్‌కి అరుదైన గౌరవం
- రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారం
Rare Honor | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి కలెక్టర్‌కి అరుదైన గౌరవం లభించింది. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు విభాగంలో కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంత రావు రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లా పురస్కారం లభించింది. ఈ అవార్డును రవీంద్రభారతిలో గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు.
16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి నిన్న ప్రకటించారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల జిల్లా అధికారులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర వహించే ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యమైన ప్రతీ ఒక్క అధికారికి కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లనే జిల్లాకి ఈ అవార్డు దక్కిందని కలెక్టర్ తెలిపారు.
