rank 302 | ఇస్రోలో ఉద్యోగం సాధించిన చందనకు సన్మానం

rank 302 | ఇస్రోలో ఉద్యోగం సాధించిన చందనకు సన్మానం
- జాగిర్యాల్ విద్యార్థిని ఉద్యోగ లక్ష్యం..
- అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..
rank 302 | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : పట్టుదలతో చదివితే ఏదో ఓ ఉద్యోగం సాధించచ్చని సంకల్పంతో తొలి ప్రయత్నంలోనే గేట్ లో ఉత్తమ ర్యాంకుతో ఇస్రోలో సైంటిస్టు(Scientist at ISRO)గా ఉద్యోగం సాధించిన భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామా శ్రీచందనను భీమ్‌గల్ లో క్రీడా పోటీలు నిర్వహించిన కార్యక్రమంలో చందనను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శాలువా మెమోటోతో సన్మానించి అభినందించారు.
దేవేందర్, స్రవంతి దంపతుల కుమార్తె అయిన శ్రీచందన గేట్ ప్రవేశ పరీక్షలో 81.67 శాతం మార్కులతో 302 ర్యాంకు(rank 302) సాధించింది. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేరై తొలి ప్రయత్నంలోనే ఉత్తమ ర్యాంకు(rank) సాధించి ఇస్రోలో ఉద్యోగం పొందటం అభినందనీ యమని కలెక్టర్ అన్నారు.

ఇదే పట్టుదల కనబరుస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఇస్రోకు మంచి సేవలు అందించి జిల్లా పేరును అలాగే పుట్టిన ఊరును నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ షబ్బీర్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి, గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ చిన్నోల్ల రాజేశ్వర్, (రాజు) రాజేశ్వర్, పోతునూరి శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మెన్ ఓమాయి రాజేశ్వర్ మాజీ సర్పంచ్ రాజమల్లు, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్, శీను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
