సీఏ పరీక్షల్లో సత్తా చాటిన రంజిత్ రెడ్డి

సీఏ పరీక్షల్లో సత్తా చాటిన రంజిత్ రెడ్డి

హిందూపురం , నవంబర్ 4(ఆంధ్రప్రభ) : నిన్న విడుదలైన గ్రూప్ – 1 CA (చార్టెడ్ అకౌంటెంట్) ఫలితాలలో సత్తా చాటిన నక్కలపల్లి యువకుడు కోనన్నగారి కేఆర్‌.రంజిత్ రెడ్డి (KR. Ranjith Reddy) రికార్డు సృష్టించారు. నిన్నటి రోజు దేశవ్యాప్తంగా విడుదల చేసిన CA గ్రూప్-1 ఫలితాలలో, మొదటిసారి పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 164 మార్కులు సాధించి ఉత్తీర్ణులైన నక్కలపల్లి గ్రామానికి చెందిన కోనన్నగారి రామిరెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మే నెల 2024 లో గ్రూప్-2 లో పరీక్షల్లో కూడా ఒకే ప్రయత్నంలోనే ఈ అబ్బాయి ఉత్తీర్ణత సాధించాడు. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో ప్రయత్నాలు చేసినా CA లో అర్హత సాధించలేని కోణంలో, రంజిత్ రెడ్డి ఒకే ప్రయత్నంలో రెండు గ్రూపులు ఉత్తీర్ణుడు కావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరూ హర్షం వ్యక్తం చేసి రంజిత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

Leave a Reply