Ranjal | ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

Ranjal | ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

  • 250 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు
  • రోగులకు ఉచిత మందులు అందజేత

Ranjal | రెంజల్, ఆంధ్రప్రభ : ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. ఈ రోజు మండలంలోని సాటాపూర్ గ్రామంలో స్థానిక రైతు వేదిక భవనంలో నిజామాబాద్ వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ లచ్చావార్ సుహాసిని నితిన్, వెల్నెస్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ పటేల్ లతో కలిసి మోబిన్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వెల్నెస్ ఆస్పత్రి నిజామాబాద్, వారి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ ఖాన్ మంచి ఆలోచనతో మారుమూల ప్రాంతమైన సాటాపూర్ లో శిబిరాన్ని ఏర్పాటు చేయడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

Ranjal

రోగులు ఆధార్ కార్డుతో వచ్చి మీ సమస్యలను వైద్యులతో చెప్పి సలహాలు, సూచనలు పాటించాలని కోరుతున్నాను. ప్రజలు వైద్య పరీక్షలతో పాటు బిపి, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులకు రక్త పరీక్షలు జరిపి, ఉచిత మందులు అందజేశారు. తమకిచ్చిన ఫ్యామిలీ కార్డు ద్వారా తమ సమస్యలను నయం చేసుకోవచ్చని కోరారు. జర్నలిస్టులకు ఉచిత కార్డు అందజేస్తామని, వారి ఫ్యామిలీకి కూడా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరంలో 250 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు అందించడం జరిగింది. ఈనెల చివరి వరకల్లా రెంజల్, దూపల్లి, కందకుర్తి, తాడ్ బోలోలి, తదితర గ్రామాలలో శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు స్పందన, పూజ, కందకుర్తి,అంబేద్కర్ నగర్ సర్పంచులు గయాసోద్దీన్, వాగ్మారే మాధవ్, మాజీ సర్పంచ్ జావిదుద్దీన్, ఉప సర్పంచ్ ఎకార్ పాషా, ఎఎంసి డైరెక్టర్ అంజయ్య, ఓబిసి లచ్చావార్ నితిన్, కురుమే సాయిలు, హజి ఖాన్, బి పోచయ్య, కంఠం గంగారాం, ముదాసిర్ ఖాన్, ముజ్జు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply