Ramoji Excellence Awards | చంద్రబాబు, రేవంత్‌ సరదా నవ్వులు

Ramoji Excellence Awards | చంద్రబాబు, రేవంత్‌ సరదా నవ్వులు

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చాలా రోజుల తర్వాత ఒకేచోట కనిపించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన రామోజీ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

అవార్డుల ప్రదానోత్సవానికి ముందు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కపక్కనే కూర్చుని సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. చంద్రబాబు ఏదో విషయం చెబుతుంటే రేవంత్‌రెడ్డి ఆ అంశానికి సంబంధించి బదులిచ్చి ఇరువురు నవ్వుకోవడం కనిపించింది.

ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల నవ్వుల్‌-పువ్వుల్‌ సామాజికమాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply