- రమేష్ నాయుడి శకం
- నంద్యాల బీజేపీలో జోష్ ..జోష్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రg శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మెన్‌గా పోతుగంటి రమేష్ నాయుడును నియమించినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన పోతుగంటి రమేష్ నాయుడుకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి తగ్గటం గర్వకారణం. ఉమ్మడి జిల్లాలోనూ, నూతన నంద్యాల జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి చరిత్రాత్మకమని బీజేపీ కార్యకరతలు కొనియాడారు.
కమిటీలు ఏర్పాటు, సభ్యత్వ నమోదు లక్ష సాధన, పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడం వంటి కార్యక్రమాలతో రమేష్ నాయుడు పార్టీని గ్రామ స్థాయికి చేర్చాడం లో కీలక పాత్ర పోషించాడని బీజేపీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలను ఒక్కచోట చేర్చి, బీజేపీని బలోపేతానికి కృషి చేసిన రమేష్ నాయుడు కి ఈ పదవి దక్కడం ప్రతి బీజేపీ కార్యకర్త గర్వించదగిన విషయంగా కమలనాథులు చెబుతున్నారు.
ఉమ్మడి కూటమి పాలనలో పదవుల పంపకంలో భాగంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి బీజేపీ నాయకత్వం కోరటం అందుకు అనుగుణంగా క్రియాశీల కార్యకర్తగా.. నాయకుడిగా పోతుగంటిరమేష్ నాయుడుకి ఇవ్వడం పార్టీకి గర్వకారణమని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట కు చెందిన పోతుగంటి రమేష్ నాయుడు చిన్నతనం నుంచి విద్యాభ్యాసం సమయంలోనే ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం తో పాటు విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
గత 20 ఏళ్లుగా బీజేపీ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పెద్దలు అమిత్ షా జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. గత రెండు సంవత్సరాల నుంచి నంద్యాల జిల్లా పార్టీ పరిశీలకులుగా కూడా ఉన్నారు. అందరిని ఐక్యం చేసే మనస్తత్వం, దానధర్మాలు చేసే గుణం కలిగి ఉండటం, బీజేపీ పెద్దల ఆశీర్వాదంతో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి దక్కిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
రాయలసీమలో బీజేపీ మరింత బలపడటానికి ఈ నియామకం తోడ్పడుతుందని బిజెపి నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పోతుగంటి రమేష్ నాయుడు నియామకం నంద్యాల జిల్లాకే గర్వకారణం అన్నారు. ఈ నియామకంతో నంద్యాల జిల్లా కార్యకర్తల్లో అవధిలేని సంతోషం వెల్లివిరిసిందన్నారు.
రమేష్ నాయుడు పార్టీకి చేసిన సేవలను రాష్ట్రం గుర్తించడం పట్ల పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారని అభిరుచి మధు పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.

