Ramaswami | ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తా..

Ramaswami | ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తా..
Ramaswami | మంథని, ఆంధ్రప్రభ : ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తానని జాడి రామస్వామి తెలిపారు. తొలిసారిగా ప్రజా సేవకు అంకితం అవుదామనే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్నానని.. ప్రజలు ఆశీర్వదించాలని జాడి రామస్వామి కోరుతున్నారు. మంథని మండలం ఆరెందా గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా రామస్వామి బరిలో ఉన్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే… ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన అన్నారు. గ్రామంలో నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉంటానని, గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని.. ఆరెందా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. వాడవాడలా ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే… ప్రజలంతా ఆయన తరపున ప్రచారం చేయడం విశేషం.
ఈసారి ఎన్నికల్లో రామస్వామి గెలుపు పక్క అని ప్రజలే ప్రచారం చేస్తున్నారు. ఆరెందా గ్రామంలో ఏ నోటా విన్న రామస్వామి గెలుపు మాటే వినిపిస్తుంది. ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటేస్తే కష్టాలని తీరుస్తానని ఆయన మాటిస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తానని, రోడ్లను, మురికి కాల్వలను మరమ్మత్తు చేయించి అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మహిళల, యువత అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తానని ఆయన తెలిపారు. పరిపాలకునిగా కాకుండా సేవకునిగా అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు వైద్య శిబిరాలని ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్తానని ఆయన వరాల జల్లు కురిపిస్తున్నారు.
