Ram charan | విమర్శలకు కారణం…?

Ram charan | విమర్శలకు కారణం…?

Ram charan | భన్సాలీతో రామ్ చరణ్ మూవీపై జోరుగా చర్చ
పీరియాడికల్ డ్రామా లేదా గ్రాండ్ లవ్ స్టోరీ?
పెద్ది రిలీజ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
చరణ్ స్పీడు పెంచాలంటున్న నెటిజన్లు
అధికారిక ప్రకటన కోసం ఎదురు చూపులు

Ram charan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌.. బాలీవుడ్ మూవీ చేయనున్నాడని.. అది కూడా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో అంటూ టాలీవుడ్, బాలీవుడ్లో జోరుగా వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. మరో వైపు చరణ్‌ పెద్ది సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. స్పీడు పెంచాల్సిన ఈ టైమ్ లో చరణ్‌.. చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. మరి.. చరణ్‌ స్పీడు పెంచుతాడా..? భన్సాలీతో చరణ్ మూవీ నిజమేనా..?

Ram charan | క్రేజీ కాంబో..

Ram charan

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. భారీ విజువల్స్, గ్రాండియర్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భన్సాలీ, ఇప్పుడు సౌత్ స్టార్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తన కెరీర్‌లో గ్లోబల్ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్‌కు పాన్ ఇండియా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా భారీ గుర్తింపు వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భన్సాలీ పేరు వినిపించడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

Ram charan | పీరియాడికల్ డ్రామా..? గ్రాండ్ లవ్ స్టోరీ..?

Ram charan

ఇక సంజయ్ లీలా భన్సాలీ గురించి చెప్పాలంటే.. ఆయన తెరకెక్కించే సినిమాలు విజువల్ ఫీస్ట్‌గా ఉండటమే కాకుండా, కథలో భావోద్వేగాలకు పెద్దపీట వేస్తాయి. దేవదాస్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలతో ఆయన తన ప్రత్యేక శైలిని నిరూపించుకున్నారు. ఇటువంటి దర్శకుడు రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తే.. అది ఏ రేంజ్‌లో ఉంటుందో అన్న అంచనాలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. అయితే.. ఈ కాంబో పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కొందరు ఇది కేవలం చర్చల దశలోనే ఉందని చెబుతుండగా, మరికొందరు ఇప్పటికే స్టోరీ లెవల్‌లో డిస్కషన్లు జరిగాయని అంటున్నారు. ముఖ్యంగా ఒక పీరియాడికల్ డ్రామా లేదా గ్రాండ్ లవ్ స్టోరీ కోసం భన్సాలీ చరణ్‌ను సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది.

Ram charan | చరణ్‌ స్పీడు పెంచాల్సిందే..

Ram charan

ఇక చరణ్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న పెద్ది సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కావాలి. వాయిదాపడింది. ఆతర్వాత ఏప్రిల్ 30న రిలీజ్ అన్నారు కానీ.. ఈ డేట్ కు కూడా వచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తుండడంతో.. చరణ్‌ స్పీడు పెంచాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ది పోస్ట్ పోన్ పై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పెద్ది తర్వాత చరణ్‌.. సుకుమార్ తో సినిమా చేయాలి. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరో వైపు సంజయ్ లీలా భన్సాలీ రన్‌ బీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ కాంబినేషన్ లో లవ్ అండ్ వార్ మూవీ తీస్తున్నారు. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సింది కానీ ప్రొడక్షన్, విఎఫెక్స్ వల్ల బాగా లేట్ అయిపోయింది. ఎలాగూ దీపావళికి రామాయణ వస్తుంది కాబట్టి లవ్ అండ్ వార్ ని 2027కి షిఫ్ట్ చేశారు. మరి.. చరణ్‌, భన్సాలీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగిన మాట వాస్తవమే కానీ.. సెట్ అవుతుందా..? లేదా..? అనేది క్లారిటీ రావాల్సివుంది. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply