రాజుకు లక్ష సహాయం

రాజుకు లక్ష సహాయం

తక్షణమే స్పందించిన తోటి వ్యాపారులు


నర్సంపేట, ఆంధ్రప్రభ: షార్ట్ సర్క్యూట్ తో బట్టల షాపు మొత్తం కాలిపోయి నిస్సహాయస్థితిలో ఉన్న యజమాని రాజుకు తోటి వ్యాపారులు తక్షణమే స్పందించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేసిన సంఘటన వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం నెలకొంది. నర్సంపేట పట్టణంలో జయశ్రీ టాకీస్ ప్రక్కన శివరామ క్లాత్ స్టోర్ సోమవారం తెల్లవారు జామున కరెంట్ షాట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బట్టల వ్యాపారులంతా తక్షణమే స్పందించి రాజు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి మేమున్నాము అధైర్య పడకు అని భుజం తట్టి ధైర్యాన్ని నింపారు.

శివరామకృష్ణ క్లాస్ స్టోర్ (Sivaramakrishna Class Store) ఓనర్ బొప్పరాతి రాజు, అతని తండ్రి బిక్షపతి రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సుమారు 1:00 గంట సమయం లో షాపులో మంటలు ఏర్పడి షాపులో ఉన్న పట్టు చీరలు ఫర్నిచర్ వివిధ రకాలైన క్లాత్ స్టోర్ అన్నీ మంటల్లో సుమారు రూ.80లక్షల విలువ గల బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటలు పై ఫ్లోర్ కు వ్యాపించడంతో ఇంట్లో నిద్రిస్తున్న బొప్పారాతి రాజు తండ్రి బిక్షపతి ఎటు వెళ్లాలో తెలియక ఇంటి ముందు నుంచి రేకుల పైన దూకి ప్రాణాలు కాపాడుకొన్నట్లు తెలిపారు.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తోటి వ్యాపారస్తులు నిలువ నీడ లేక కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాడని తెలుసుకొని బట్టల వర్తకా సంఘం అధ్యక్షులు కూచన రవీందర్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు తక్షణ సహాయం కింద ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలంటే చెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు.

Leave a Reply