Rajinikanth | వక్రీకరించారంటూ వివరణ…

Rajinikanth | వక్రీకరించారంటూ వివరణ…

Rajinikanth | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తమిళనాడులో ప్రముఖ నటుడు రజనీకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీవీకే (తమిళగ వెట్రి కళగం) నేత ఆదవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే బెదిరించిందని అర్జున చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలను రజనీకాంత్ ఖండించగా, ఆయన అభిమానులు, నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

టీవీకే సభలో ఆదవ్ అర్జున బహిరంగంగా రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పారు. తన మాటలను వక్రీకరించారంటూ ఆదవ్ అర్జున వివరణ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే కుట్ర చేసిందనే అన్నానన్నారు. డీఎంకే విషప్రచారం చేస్తోందన్నారు. వారు 22 పార్టీలతో పొత్తు పెట్టుకుని వస్తున్నారన్నారు. గతంలో రజనీకాంత్ ను దూషించింది డీఎంకేనే అన్నారు. ఉదయనిధి ఎలాంటి పోస్టులు పెట్టారో తెలియదా..? అన్నారు.

Leave a Reply