Rajasthan | కుప్పకూలిన పాఠశాల భవనం… నలుగురు మృతి

రాజస్థాన్ : రాజస్థాన్ (Rajasthan ) లోని ఝలావర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలి విద్యార్థులపై (School Roof Collapsed) పడటంతో.. నలుగురు మృతి (Four died) చెందారు. మరో 20మంది చిన్నారులకు గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక నివాసితులు, పోలీసులు, అధికారులు సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. శిథిలాల కింద పలువురు విద్యార్థులు చిక్కుకోగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
