ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో వేగంగా ముందుకు సాగుతున్నాడు. కాగా, ప్రభాస్ త్వరలో ‘రాజసాబ్’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
అయితే, ప్రభాస్ హారర్ కామెడీ జానర్లో తొలిసారి కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్ర బృందం కొన్ని పోస్టర్లు, గ్లింప్స్ విడుదల చేసి ఆసక్తిని పెంచింది. తాజాగా ప్రభాస్ ఓ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆయన కార్ పై కూర్చొని స్టైలిష్ లుక్తో మెరిసిపోతున్నారు.
ఇక అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న ‘రాజాసాబ్’ టీజర్ రేపు, అంటే జూన్ 16వ తేదీ ఉదయం 10:52 గంటలకు విడుదల కాబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టీజర్ కోసం వేచి చూస్తున్న ప్రేక్షకుల ఉత్సాహం ఇప్పటికే పెరిగిపోతుంది.
