Rajanna | ఓటమి భయంతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..!

Rajanna | ఓటమి భయంతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..!
Rajanna | ఉమ్మడి ఆదిలాబాద్ , ఆంధ్రప్రభ బ్యూరో : తుది విడత ఎన్నికల్లో సర్పంచ్ కు ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బీఆర్ఎస్ మద్దతు దారుడైన రాజన్న డబ్బులు లేక ముందుగానే ఓటమిని పసిగట్టాడు. ప్రత్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని, తనకు ఈ రోజు ఓటమి తప్పదనే భయంతో కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం రాస్ పెల్లి గ్రామానికి చెందిన బొమ్మెళ్ల రాజన్న పోలింగ్ జరుగుతుండగానే పురుగుల మందు తాగాడు. ఆయన పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు.
