కుమ్మెర ఘటనను ఖండించిన రజక సంఘం నేతలు..

నార్సింగ్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో గుడిలోకి ప్రవేశించారనే కారణంతో రజకులపై జరిగిన దాడిని మెదక్ జిల్లా రజక సంఘం నార్సింగి మండల అధ్యక్షుడు రాయలపురం శ్రీనివాస్, ఖండించారు. రెండు నెలల పసిబిడ్డ హత్య దారుణమని పేర్కొన్నారు. నిందితులపై ఐపీసీ 302 వంటి కఠిన సెక్షన్లు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ న్యాయం చేయాలని కోరారు. లేని పక్షమున పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Leave a Reply