భూపాల‌ప‌ల్లి జిల్లా ప్ర‌తినిధి, గోదావ‌రి ఖ‌ని : భారీ వ‌ర్షాల‌తో సింగ‌రేణి (Singareni) బొగ్గు ఉత్ప‌త్తికి విఘాతం. బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rainfall) తో సింగరేణి బొగ్గు పరిశ్రమకు సంబంధించి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తులకు ఆటంకం ఎదురవుతుంది. రామగుండం రీజియన్ (Ramagundam Region) లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో సుమారుగా ఒక రోజుకు 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది.

వర్షాలకు ఓపెన్ కాస్ట్ (Open Cast) ప్రాజెక్టుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భూపాలపల్లి సింగరేణి (Singareni) ఏరియా పరిధిలోని ఓపెన్ ప్రాజెక్టు -2, -3 ప్రాజెక్టుల్లో గత రెండు రోజులుగా భారీగా వర్షం నీరు చేయడంతో ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఓసీ పరిసర ప్రాంతాలను బురదమయం కావడంతో భారీ వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో రోజు సుమారు 6,000 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి (Coal production) నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply