Railway | వ్యవస్థాగత సంస్కరణలు, నైపుణ్య వృద్ధి రైల్వేల అభివృద్ధికి కీలకం

Railway | వ్యవస్థాగత సంస్కరణలు, నైపుణ్య వృద్ధి రైల్వేల అభివృద్ధికి కీలకం

  • దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

Railway | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దక్షిణ మధ్య రైల్వే ఈ రోజు సికింద్రాబాద్‌లోని న్యూ భోయిగూడలో ఉన్న రైల్ కళారంగ్‌లో 70వ రైల్వే వారోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై, డివిజన్లు, విభాగాలకు జోనల్ సామర్థ్య షీల్డ్‌లను, అలాగే అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట రైల్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఆశిష్ మెహ్రోత్రా, డిప్యూటీ జనరల్ మేనేజర్(జి) శ్రీ ఉదయనాథ్ కోట్లా, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, డివిజనల్ రైల్వేమేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అవార్డు గ్రహీతలను అభినందించి, 2024సంవత్సరంలో వారు అందించిన అత్యుత్తమ సేవలను ప్రశంసించారు. సంస్థ నిజమైన బలం ఉద్యోగులే అని పేర్కొంటూ, జోన్ తన సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. జనరల్ మేనేజర్ జవాబుదారీతనం, కార్యాచరణతో కూడిన రైలు వినియోగదారుల సేవ, నిర్వహణ, ఉత్పత్తి మొదలైన అన్ని రంగాలలో కాలపరిమితితో కూడిన మార్పులతో వ్యవస్థాగత సంస్కరణలను తీసుకురావాలని పిలుపునిచ్చారు. నూతన ఆలోచనలను ప్రోత్సహిస్తూ వాటిని స్వాగతించాలని, మూల్యాంకనం చేసి, అమలు చేయాలని ఆయన అన్నారు.

Railway |

జనరల్ మేనేజర్ ఆధునికయుగ సాంకేతిక పరిజ్ఞానాలతో ముందుకు సాగడానికి నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేయవలసిన అవసరాన్నినొక్కి చెప్పారు. వివిధ డిజిటల్ మాధ్యమాలలో అందుబాటులోనున్న అపారమైన జ్ఞానాన్ని ఉపయోగించుకుని సమర్థవంతమైన శ్రామిక శక్తిని నిర్మించాలని ఆయన అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించారు. శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ భారత రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరంతరం అభివృద్ధి వైపు కృషి చేస్తోందని భద్రతపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయని పునరుద్ఘాటించారు.

Railway |

దక్షిణ మధ్య రైల్వే అదే వృద్ధి స్ఫూర్తితో ముందుకు సాగుతూ, తన విజయపతాకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. జోనల్ స్థాయిలో ఓవర్ ఆల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్‌ను హైదరాబాద్ & గుంతకల్లు డివిజన్‌లకు సంయుక్తంగా జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవగారిచే ప్రదానంచేయబడింద‌న్నారు. జనరల్ మేనేజర్ క్రింద వివరించిన విధంగా జోన్‌లోని వివిధ డివిజన్‌లు, వర్క్‌షాప్‌లకు మరో 35 జోనల్ స్థాయి ఎఫిషియెన్సీ షీల్డ్‌లను కూడా అందజేశారు.

  • సికింద్రాబాద్ డివిజన్: ఫైనాన్స్(అకౌంట్స్) షీల్డ్, పరిశుభ్రత కోసం జీఎం షీల్డ్ (స్టేషన్ – గుంటూరు డివిజన్‌తో సంయుక్తంగా) ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ షీల్డ్, ఉత్తమ ట్రాక్ షీల్డ్ (విజయవాడ డివిజన్‌తో సంయుక్తంగా), సివిల్ ఇంజనీరింగ్ షీల్డ్ (విజయవాడ డివిజన్‌తో సంయుక్తంగా) ; మెకానికల్ షీల్డ్, ఉత్తమంగా నిర్వహించబడే సుదూర రైళ్లు (ట్రైన్ నం.12727/12728 గోదావరి ఎక్స్‌ప్రెస్), ఆపరేటింగ్ షీల్డ్లను సికింద్రాబాద్ డివిజన్ అందుకుంది.
  • హైదరాబాద్ డివిజన్ : వర్క్స్ షీల్డ్, సేఫ్టీ షీల్డ్, సిగ్నల్ & టెలికాం షీల్డ్; పర్యావరణం, హౌస్ కీపింగ్ నిర్వహణ, రాజభాష (హిందీ) షీల్డ్, జనరల్ మేనేజర్ ఓవరాల్ ఎఫిషియెన్సీ షీల్డ్ లను గుంతకల్లు డివిజన్‌తో కలిసి అందుకున్నారు.
  • విజయవాడ డివిజన్ : కమర్షియల్ షీల్డ్, ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్ షీల్డ్, సివిల్ ఇంజనీరింగ్ షీల్డ్ (సికింద్రాబాద్ డివిజన్‌తో సంయుక్తంగా) ; హెచ్‌.ఆర్‌.డి(పర్సనల్)షీల్డ్, ఉత్తమంగా నిర్వహించబడిన ఎం.ఆర్.వి షీల్డ్ (నాందేడ్ డివిజన్‌తో సంయుక్తంగా) ; ఇన్నోవేషన్స్(ఆవిష్కరణలు) షీల్డ్‌ను విజయవాడ డివిజన్ అందుకుంది.
  • గుంతకల్లు డివిజన్ : ఆపరేషన్స్ & రన్నింగ్ రూమ్ షీల్డ్, బెస్ట్ ట్రాక్ షీల్డ్ (సికింద్రాబాద్ డివిజన్‌తో కలిసి), లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు కోసం ఉత్తమ డివిజన్ (నాందేడ్ డివిజన్‌తో కలిసి) ; ఉత్తమ లోడింగ్ కోసం ప్రయత్నం చేసిన డివిజన్, బెస్ట్ స్కూల్ (రైల్వే హై స్కూల్ /ఆంగ్ల మాద్యమం /గుంతకల్లు), (ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం) గ్రీవెన్స్ రిడ్రెసల్ మెషినరీ షీల్డ్, సెక్యూరిటీ షీల్డ్, జనరల్ మేనేజర్ ఓవరాల్ ఎఫిషియెన్సీ షీల్డ్ (హైదరాబాద్ డివిజన్‌తో కలిసి) గుంతకల్లు డివిజన్ అందుకుంది.
  • గుంటూరు డివిజన్ : పరిశుభ్రత (స్టేషన్ – సికింద్రాబాద్ డివిజన్‌తో సంయుక్తంగా) కోసం జనరల్ మేనేజర్ షీల్డ్, ట్రాక్ మెషీన్ల ఉత్తమ వినియోగం, మెడికల్, సేఫ్టీ షీల్డ్, ఉత్తమంగా నిర్వహించబడిన ఎ.ఆర్.టి (ప్రమాదం ఉపశమనం రైలు) షీల్డ్ మరియు స్క్రాప్ డిస్పోజల్ షీల్డ్లను గుంటూరు డివిజన్ అందుకుంది.
  • నాందేడ్ డివిజన్ : లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపుకు ఉత్తమ డివిజన్ ( గుంతకల్లు డివిజన్‌తో కలిసి), బ్రిడ్జెస్ షీల్డ్, ఉత్తమంగా నిర్వహించబడిన ఎం.ఆర్.వి షీల్డ్ (విజయవాడ డివిజన్‌తో కలిసి), ఉత్తమ డివిజన్ కు లభించే రైల్ మదద్ షీల్డ్‌లను నాందేడ్ డివిజన్ అందుకున్నది.
  • సర్వే, కన్స్ట్రక్షన్ షీల్డ్ – డిప్యూటీ సి.ఈ/కన్స్ట్రక్షన్/ కాజీపేటకు అందజేయబడింది.
  • ఉత్తమ డీజిల్/ఎలక్ట్రిక్ లోకో షెడ్ : ఎలక్ట్రిక్ లోకో షెడ్/విజయవాడకు అందజేయబడింది.
  • ఉత్తమ మెకానికల్ వర్క్ షాప్ : తిరుపతి వర్క్ షాప్ కు అందజేయబడింది.
  • ఉత్తమంగా నిర్వహించబడుతున్న డెమూ/మెమూ/ఈ.ఎం.యూ షెడ్: డీజిల్ లోకో షెడ్/ మౌలా–అలీ కు అందజేయబడింది.
  • ఉత్తమ స్టోర్స్ డిపో షీల్డ్ : ఎమ్ &ఈ లాలా గూడకు అందజేయబడింది
    జనరల్ మేనేజర్ 70వ రైల్వే వారోత్సవాల సందర్భంగా అధికారులు, సిబ్బందికి వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా 86 వ్యక్తిగత అవార్డులను కూడా ప్రదానం చేశారు. ముందుగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్ స్వాగతొపన్యాసంలో ఎఫిషియెన్సీ షీల్డ్‌లు పొందిన డివిజన్‌లను, వ్యక్తిగత అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. అదనపు జనరల్ మేనేజర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్ సాధించిన ముఖ్యమైన విజయాల గురించి కూడా వివరించారు. రైల్వే సిబ్బంది ప్రదర్శించిన పాటలు, నృత్య ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో అలరించాయి.

Leave a Reply