Railway | గేటు మూసివేత..

Railway | గేటు మూసివేత..
Railway, నరసరావుపేట, ఆంధ్రప్రభ : గుంటూరు (Guntur) డివిజన్ పరిధిలోని సాతులూరు – నర్సరావుపేట సెక్షన్‌లో కిమీ 40/15–17 వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 287 వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ పనులు నవంబర్ 26న ఉదయం 7 గంటల నుండి నవంబర్ 28న సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. మూడు రోజుల పాటు గేట్ మూసివేయబడుతుందనీ, ఈ సమయంలో రహదారి ట్రాఫిక్ పై పూర్తి ఆంక్షలు అమల్లో ఉంటాయని డివిజన్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రైళ్ల సురక్షిత నడక కోసం ఈ పనులు అత్యవసరమని రైల్వే తెలిపింది. ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని డివిజన్ విజ్ఞప్తి చేసింది. తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తూ, ప్రజల సహకారం కోరింది.
