Raghunathapalli | పనిచేయని మొబైల్ నెట్‌వర్క్‌లు

Raghunathapalli | పనిచేయని మొబైల్ నెట్‌వర్క్‌లు

  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు..

Raghunathapalli | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఖిలాషాపురం గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్‌లు సరిగా పనిచేయకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ కాల్స్ పొకపోవడం, ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడం వల్ల విద్యార్థుల ఆన్‌లైన్ విద్యకు ఆటంకం ఏర్పడుతోంది. అలాగే రైతులు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం పొందలేక ఇబ్బంది పడుతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, వైద్య సేవలు, ఇతర అవసరాల కోసం ఫోన్ చేయలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, ఆన్‌లైన్ లావాదేవీలు కూడా నిలిచిపోయాయి. ఈసమస్యపై సంబంధిత టెలికాం అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామంలో నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply